Tirumala: తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు నేడు విడుదల.. శ్రీవాణి టోకెన్లు కూడా..!

Tirumala Srivani June Quota Released: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శించుకోవడానికి ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకుంటారు. ఈ ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవ, లక్కీ డిప్‌ వంటి టోకెన్లు మూడు నెలలు ముందుగానే విడుదల చేస్తారు. ఈనేపథ్యంలో ఈరోజు అంటే మార్చి 22 ఉదయం అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
 

1 /5

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లు నేడు మార్చి 22 ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే మార్చి 18, 19 రెండు రోజులు లక్కీ డిప్‌కు సంబంధించిన టోకెన్లు కూడా జారీ చేసింది.  

2 /5

నిన్న ఆర్జిత సేవ టిక్కెట్లను విక్రయించింది. ఇక శనివారం రోజు తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్లు జారీ చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు జూన్‌ నెలకు సంబంధించినవి ఈరోజే ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.  

3 /5

ఇక ఇదే రోజు అంటే మార్చి 22వ తేదీ వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన జూన్‌ నెల కోటాను కూడా విడుదల చేయనున్నారు. ఇవి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. రేపు మార్చి 24వ తేదీనా ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు గదులు బుక్‌ చేసుకోవచ్చు.  

4 /5

అయితే, భక్తులు ఫేక్‌ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దు. కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.   

5 /5

ఇక నిన్న ఒక్కరోజే 64 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  ఇందులో 26 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లకు పైగా వచ్చాయని టీటీడీ తెలిపింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచిఉన్నారు.