Tirumala Tirupati Devasthanam: హిందువులు ప్రతి ఒక్కరు కచ్చితంగా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి తపిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ . వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టిక్కెట్ లేని సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
వీకెండ్ వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. టిక్కెట్లు లేని సర్వదర్శనానికి ఇంత సమయం పడుతోంది. టోకెన్లు ఉన్నవారికి కాస్త తక్కువ సమయం పడుతుంది.
ఇక వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 31 కంపార్ట్‌మెంట్లో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. నిన్న స్వామివారి దర్శనం 62,000 మందికి పైగా చేసుకున్నారు.
ఇందులో తలనీలాలు 25 వేల మందికి పైగా సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం 3.65 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. అయితే నిన్న తిరుపతి శ్రీ కోదండ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా నాలుగో రోజు స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులను కనివిందు చేశారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వామితో పాటు ఈఓ శ్రీమతి నాగరత్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా టీటీడీ అనుబంధాలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు.
గోవింద స్వామి వారి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కోదండ రామ లయంలో శ్రీనివాస మంగాపురంలో కూడా ఉగాది వేడుకలు నిర్వహించారు. ప్రధానంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.