Add Zee Business As A Preferred Source
App

Tirumala: ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. బంగారు తిరుచ్చి వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు..

Written ByRenuka Godugu
Published: Oct 03, 2025, 09:12 AM IST|Updated: Oct 03, 2025, 09:12 AM IST

Tirumala Salakatla Brahmotsavam: తిరుమలలో శ్రీవారి సాల కట్ల ఉత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇక చివరి రోజు నిన్న 2025 అక్టోబర్ 2వ తేదీ బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఆ ఫోటోలు చూద్దాం.
 

Salakatla1/5

సాలకట్ల

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. నిన్న ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామి వారు బంగారు తిరుచ్చి వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడి రూపంలో దర్శనమిచ్చారు  

Brahmotsavam2/5

బ్రహ్మోత్సవం

 ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు వచ్చారు. వివిధ వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగిన వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చి మొక్కులు కూడా తీర్చుకున్నారు. సెప్టెంబర్ 24న మొదలైన ఈ ఉత్సవాలు నిన్నటి వరకు నిర్వహించారు. నిన్న రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.   

Dussehra3/5

దసరా

 అయితే దసరా సందర్భంగా సెలవులు కావడంతో తిరుమలలో రద్దీ బాగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. వెంకటేశ్వర దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు.  

Tirumala tirupati devasthanam4/5

తిరుమల తిరుపతి దేవస్థానం

 నిన్న ఒక్కరోజు శ్రీవారిని 75,000 మంది మైకా భక్తులు దర్శించుకోగా ఇందులో 31 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.  

Tirumala5/5

తిరుమల

ఇక తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు భక్తుడు. ఖమ్మం చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్టైల్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ రూ.30 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ నాయుడుకు చెక్కును అందజేశారు.