Veenapani on Hamsa Vahanam Photos: దసరా నవరాత్రుల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే గురువారం రాత్రి మాడవీధుల్లో శ్రీవారు శ్రీ మల్లప్ప స్వామి సరస్వతీ అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. మాడవీధుల్లో స్వామి వారు విహరిస్తూ వారిని అనుగ్రహించారు. స్వామివారి బ్రహ్మోత్సవ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/5భక్తులకు కనువిందు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళాబృందాల ప్రదర్శనలు కూడా ఎంతగానో భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా శ్రీవారి భక్తుల్లో ఉన్న అహం భావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మ ప్రాప్తి కలిగించేందుకే ఈ హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారని కూడా పురాణాలు చెబుతున్నాయి.
3/5నిన్న బ్రహ్మోత్సవాలు రెండో రోజు సందర్భంగా హంస వాహనంపై స్వామివారి సరస్వతి అలంకారంలో విహరించారు. ఇక మూడో రోజు అయిన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యాల సేవలు కూడా జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
4/5తిరుమలలో ప్రతి మూడు నెలలకు ముందుగానే స్వామి వారి ప్రత్యేక దర్శనం టోకెన్లతో పాటు గదుల కేటాయింపు కూడా జరుగుతుంది. ఇకపై గదుల బుకింగ్‌లో ఇబ్బందులు ఉండవు. తిరుమల శ్రీవారి దర్శనానికి వసతి కష్టాల తీరనున్నాయి. ఎందుకంటే కొండపై కొత్త వసతి సముదాయం ప్రారంభమైంది ఇది భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు.
5/5వెంకటాద్రి నిలయాన్ని యాత్రికుల కోసం రూ.102 కోట్లతో నిర్మించారు. దీనికి ముందస్తు బుకింగ్ లేకున్నా కానీ ఒకేసారి 4 వేల మందికి ఉచిత వసతి సదుపాయం కల్పించనుంది. ఇందులో లాకర్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు.