Garuda seva in Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తిరుమలకు పొటెత్తారు.ఈ క్రమంలో ఎక్కడ చూసిన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు టీటీడీ భక్తులకు కీలక సూచనల్ని చేసింది.
1/6తిరుమలలో సాలకట్ల సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు తండొప తండాలుగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా టీటీడీస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడకూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది.
2/6కొండపైకి టూవీలర్,కార్లలతో వచ్చే భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేసింది.మరికొన్ని గంటల్లో స్వామివారికి అత్యంత గరుడ వాహన సేవ జరుగనుంది. ఈ ఉత్సవంను తిలకించేందుకు దేవతలు సైతం భూమికి వస్తారని పురాణాల్లో ఉంది.
3/6అయితే.. తిరుమల్లోని రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, గ్యాలరీలు అన్నీ భక్తులతో పూర్తిగా నిండి పోయాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో కేవలం బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
4/6అదే విధంగా.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాత్రం ద్విచక్ర వాహనాలకు మినహా అన్ని వాహనాలకు తొలుత అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఘాట్ రోడ్డులో కేవలం బస్సులను మాత్రమే అనుమతి ఇస్తుండటంతో.. బస్సుల్లోకి ఎక్కేందుకు భక్తులు భారీగా ఎగబడుతున్నారు. ప్రైవేటు వాహనాల్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎక్కడకూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
5/6మరోవైపు, తిరుమలలోని నాలుగు మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గరుడ సేవను దగ్గర నుంచి చూసేందుకు శనివారం రాత్రి నుంచే వేలాది మంది భక్తులు గ్యాలరీలలోకి చేరుకుని, అక్కడే రాత్రి నుంచి జాగారం చేశారు.
6/6చలిని సైతం లెక్కచేయకుండా ఎదురుచూస్తున్న వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు, తాగునీరు వంటివి అందించారు.భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగు మాడ వీధుల్లో భక్తులను కంట్రోల్ చేసేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.