Tirumala Srivari Darshan: శ్రీవారి దర్శించుకోవడానికి తిరుమల వెళ్లే భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ముందుగానే గమనించగలరు. తద్వారా ఇబ్బందులు పడకుండా ఉంటారు.
తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనం కోసం చాలామంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లలో ఎదురు చూస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే కేవలం 72,000 మందికి పైగా దర్శించుకోక 26,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు
నిన్న తిరుమల శ్రీ వెంకటేశ ని ఆలయ హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం తెలిపింది. అయితే, శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా రద్దీ పెరగడంతో ఆటోవాలాలు నయా దందాకు తెరలేపుతున్నారు.
శ్రీవారి మెట్ల వద్ద టోకెన్లు ఇస్తున్నారని రైల్వే స్టేషన్ నుంచి భక్తులను తీసుకెళ్తున్నారు. వారి వద్ద నుంచి ఒక్కక్కరికీ రూ.500 వసూలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. శని, ఆదివారాల్లో భక్తులు జాగ్రత్త వహించాలని సూచించారు, అంతేకాదు అపరిచితులను నమ్మి మోసపోవద్దు అని చెప్పారు,
మార్చి 24వ తేదీ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ జరగనుంది. ప్రతినెల ఉత్తరాషాడ నక్షత్రంలో టీటీడీ గజా వాహన సేవలు నిర్వహిస్తుంది. అమ్మవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.