Tirumala Darshan Tickets Alert: తిరుమల శ్రీ వెంకటేశుని దర్శించుకోవడానికి టికెట్లు బుక్ చేసుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం కీలక సూచన చేసింది. ముఖ్యంగా శ్రీవారి భక్తులు దర్శనం టికెట్లతో పాటు వసతి గదులు కూడా ముందుగానే బుక్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఫేక్ వెబ్సైట్లో కాకుండా టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని కీలక సూచన చేసింది.
నకిలీ వెబ్సైట్లు ఎక్కువగా ఉండటంతో తిరుమల వెంకటేషుని దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకుని చాలా మంది భక్తులు మోసపోయారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకునే భక్తులు ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దు. కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోమని కీలక సూచన చేసింది.
ముఖ్యంగా శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి గదుల బుకింగ్ కి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయిన https://TTDevasthanam.ap.gov.in మాత్రమే బుక్ చేసకోవాలని టీటీడీ నిఘా, భద్రత విభాగం విజ్ఞప్తి చేస్తుంది.
ఇక మార్చి 9వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వామి వారు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తెప్పపై ఊరేగారు. ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తులను ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.
ఇక తెప్పలను దేదీప్యమానంగా విద్యుద్దీపాలతో అలంకరించి స్వామి వారిని పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులను కటాక్షించారు. అయితే రేపు మూడవరోజు శ్రీ భూదేవి శ్రీదేవి సమేతంగా మలయప్ప స్వామి వారిగా అభయం ఇవ్వనున్నారు.
మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజులపాటు సాలకట్ల ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా రద్దు చేశారు. మార్చి 14వ తేదీ కుమార తీర్థ ముక్కోటికి తిరుమల దేవస్థానం విస్తృత ఏర్పాటు చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
అయితే ఈ ఉత్సవాలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడటం లేదు.. అంతేకాదు ట్రాఫిక్ దృశ్య ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించడం లేదు. పాప వినాశనం నుంచి కుమార తీర్థం వరకు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఈ ఉత్సవం నిర్వహించనున్నారు.