Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వయో వ్రుద్దులు, దివ్యాంగుల కోటాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో లక్కీడీప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1/7తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కోటాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.
2/7ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన కోటా ఆన్‌లైన్‌లో లభ్యం అవుతాయి. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు భక్తుల కోసం అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటా కూడా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంది. దర్శన టికెట్లతో పాటు వసతి సదుపాయాలను ఒకేసారి బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.
3/7ఇక ‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం జరుగుతుంది.
5/7ఈ ఉత్సవాల్లో రోజువారీ వాహన సేవలు ఇలా ఉంటాయి. సెప్టెంబర్ 22న తిరుచ్చి, 23న శేష వాహనం, 24న చిన్న ప్రభ, 25న హనుమంత, 26న గరుడ, 27న ముత్యపు పందిరి, 28న గరుడ, 29న తిరుచ్చి, 30న సర్వభూపాల వాహనం, అక్టోబర్ 1న చిన్న శేష వాహనం, అక్టోబర్ 2న అశ్వ వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో టీటీడీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న FIFO (First In First Out) పద్ధతిని నిలిపి, ‘లక్కీ డిప్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిసెంబర్ నెల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి మాత్రమే టోకెన్లు కేటాయిస్తారు. శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ అవుతాయి. అలాగే, భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులుగా 180 రోజులకు పెంచారు. టీటీడీ తెలిపిన ఈ మార్పులు, సదుపాయాలు, ప్రత్యేక ఉత్సవాలు భక్తులకు మరింత సులభతరం కానున్నాయి.