Tirumala Free Bus: తిరుమల వెళ్లే మహిళా భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. తిరుమల లోని అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. మహిళలకు తిరుమలలో ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల లోని కొన్ని ఉచిత వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా స్వామి వారి దర్శనం ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చు.
అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే మహిళా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇక తిరుమల లోని అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
ఆర్టీసీ ఈ సేవలను ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక తొలి దశలో భాగంగా 150 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు శ్యామల రావు వెల్లడించారు. టీటీడీలో ఇప్పటికే 21 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని శ్యామల రావు అన్నారు. వారి ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇక తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డులో బీటీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని ఈనేపథ్యంలో వాహనాలు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. భక్తుల కోసం కల్పించకుండా ఉండడానికి ఘాట్ రోడ్డు మూసి వేయకుండా పనులు చేస్తున్నామని ప్రణాళిక బద్ధంగా భక్తులు తిరుమల ప్రయాణాన్ని ముందుకు ప్రారంభించాలని టీటీడీ కోరుతోంది.
ఒక టీటీడీ ఈ ఘాట్ రోడ్డులో వెళ్లే వాళ్ళు నెమ్మదిగా అక్కడక్కడ ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందని భక్తులను గమనించగలరు. మరింత సులభంగా సౌకర్యంగా కల్పించేందుకు పనులు పూర్తి చేస్తున్నామని టీటీడీ తెలిపింది.