Add Zee Business As A Preferred Source
App

Tirumala Good News: తిరుమల భక్తులు ఎగిరిగంతేసే వార్త.. ఇక దర్శనానికి ఇబ్బందే లేదు..!

Written ByVishnupriya
Published: Sep 23, 2025, 06:45 PM IST|Updated: Sep 23, 2025, 10:30 PM IST

Tirumala Darshan : తిరుమల కి రోజు ఎంత మంది జనం వస్తూ ఉంటారో చెప్పనవసరం లేదు. వీక్ డేస్ లో కూడా.. వీరి సంఖ్య ఎన్నో లక్షల్లో ఉంటుంది. సెలవలు.. సాధారణ రోజులు అనే తేడా లేకుండా.. తిరుమలలో ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది.. ఈ క్రమంలో భక్తులకు గుడ్ న్యూస్ రాబోతోంది..

Tirumala New Facility 1/5

తిరుమల గుడ్ న్యూస్

టీటీడీ.. ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు కలగజేస్తూ.. తిరుమల వచ్చే భక్తులకు.. దాదాపు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ తిరుమలలో రోజు కూడా రద్దీ విపరీతంగా ఉంటుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Tirupati Darshan2/5

తిరుమల గుడ్ న్యూస్

ఈ రద్దీ వల్లనే చాలామంది ఎన్ని సౌకర్యాలు ఉన్నా కొన్నిసార్లు ఇబ్బందులు పడక తప్పదు. ఈ క్రమంలో టీటీడీ సరికొత్తగా తీసుకున్న నిర్ణయం.. భక్తులకు ఎంతగానో ఊరట కలిగించేలా ఉంది. 

Tirumala Darshan Timings3/5

తిరుమల గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించడానికి.. అలానే వసతి, భద్రతను పెంచడానికి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను ఏర్పాటు చేస్తోంది టీ తిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న.. ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. 

Tirumala Rush4/5

తిరుమల గుడ్ న్యూస్

ఇక ఇది కాని మొదలైతే..దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటైనట్లు లెక్క. కొండపై ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో.. వైకుంఠం-1లో ఈ ఏఐ సెంటర్ ను.. ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని నియంత్రిస్తారు. అలానే.. వసతి, భద్రతను కూడా మెరుగుపరుస్తారు.

TTD Good News 5/5

తిరుమల గుడ్ న్యూస్

క్యూలైన్లలో అసలు ఎంతమంది భక్తులు ఉన్నారు? ఎంత సమయం నుంచి అక్కడ ఉన్నవాళ్లు..వేచి ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. అలానే భక్తుల మొహం.. కదలికను బట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను కూడా ఏఐ గుర్తు పడుతుంది. కాబట్టి ఈ సెంటర్ల ద్వారా భక్తుల అసౌకర్యాలు గమనించడానికి సులభం అవుతుంది.