Tirumala Heavy Rains: తిరుమలలో భారీ వర్షం నేపథ్యంలో భక్తుల సంఖ్య దర్శనానికి సమయం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 20 కంపార్ట్‌మెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
1/5తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తుల కీలక అలర్ట్. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో తిరుమల లో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు దర్శనం చేసుకుంటా ఉంటారు.
2/5అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్నాయి. తిరుమల లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా నిన్న ఒక్కరోజే శుక్రవారం 71,000 మందికి పైగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. 25000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు నేను ఒకరోజే ఉండే ఆదాయం రూ. 4.89 కోట్లు
3/5ఇక తెల్లవారుజామునుంచే తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వల్ల ఈ భారీ వర్షం కురుస్తుంది. ఇది ఎల్లుండి తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది
4/5ఇక ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణ, కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
5/5ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది మంది శ్రీవారి దర్శనం కోసం లైన్‌లలో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈరోజు జనవరి తేదీకి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ. 300 టికెట్లు ఉదయం 10 గంటలకు జారీ చేయనున్నారు. దీంతో పాటు అదే రోజు మూడు గంటలకు ప్రత్యేక గదుల కోటా కూడా విడుదల చేశారు.