Rush In Tirumala: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. మొన్నటి వరకు గణపతి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
1/5శ్రీవారి సర్వదర్శనానికి మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తులు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి క్యూలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి దర్శనానికి 59 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
2/5మొన్నటి వరకు వినాయక చవితి నవరాత్రి రోజు సందర్భంగా భక్తుల రద్దీ తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా వరుసగా వీకెండ్ రావడంతో మరోసారి తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల కు దేశ నలుమూలలో మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తారు.
3/5శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో భారీ ఎత్తున భక్తులు వేచి ఉంటారు. అయితే నిన్న ఒక్కరోజే స్వామివారి దర్శనానికి 59,000 మందికి పైగా దర్శించుకున్నారు. ఇందులో 24 వేల మందికి పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు
4/5ఇక తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులను మోసగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. భక్తులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని మోసగించి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోవద్దని సూచించింది.
5/5ఇక భక్తులు వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోకుండా ఉండాలి. ఇక ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తే విజిలెన్స్ విభాగానికి చెందిన 0877-2263828 నంబర్ కి కూడా ఫోన్ చేసి వివరాలు ఇవ్వవచ్చని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ అయిన https://ttdevathanams.ap.gov.in లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది.