Add Zee Business As A Preferred Source
App

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో ఫుల్‌ రష్, శ్రీవారి దర్శనానికి 15 గంటలు..

Written ByRenuka Godugu
Published: Sep 16, 2025, 10:28 AM IST|Updated: Sep 16, 2025, 10:28 AM IST

Tirumala Huge Crowd: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దరి కొనసాగుతూనే ఉంది గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఈ నేపథ్యంలో టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల వరకు సమయం పడుతుంది. స్వామివారి వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లలో భక్తుల వేచి ఉన్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
 

Devotees rush1/5

భక్తుల రద్దీ

 తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో వీకెండ్, ప్రత్యేక రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.  

Queue Complex2/5

క్యూ లైన్

 ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం ఒక్కరోజే 65,000 మందికి పైగా స్వామి వారిని దర్శించుకోగా ఇందులో 24 వేల మందిపైగా తలనీలాలు సమర్పించారు.  

TTD3/5

టీటీడీ

 ఇక నిన్న సోమవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇదిలా ఉండగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  

4/5

ఈ నేపథ్యంలో ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 435 బస్సులు నడపాలని నిర్ణయించింది. శ్రీవారి భక్తులకు సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు వస్తారు. వాళ్లకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా కల్పించింది. మొత్తంగా 23 ప్రదేశాల్లో భక్తులకు పార్కింగ్ సౌకర్యం కేటాయించారు.  

Tirumala5/5

తిరుమల

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారు భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు నెలలకు ముందుగానే స్వామి వారి దర్శనం కోసం టికెట్లు కూడా కేటాయిస్తారు. ఇవి కాకుండా ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. సర్వదర్శనం టోకెన్లు కూడా ఏ రోజుకు ఆ రోజుకి అందుబాటులో ఉంటాయి.