Add Zee Business As A Preferred Source
App

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Written ByRenuka Godugu
Published: Sep 12, 2025, 10:14 AM IST|Updated: Sep 12, 2025, 10:16 AM IST

Tirumala Huge Rush: తిరుమలలో భక్తుల రద్దీ మరోసారి పెరిగింది. టోకెన్లు లేని శ్రీవారి భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక రానున్నవి నవరాత్రుల సందర్భంగా కూడా తిరుమలలో భక్తి రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఆ రోజుల్లో సెలవులు, తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ ఉండనుంది. 
 

Tirumala Tirupati Devasthanam1/5

తిరుమల తిరుపతి దేవస్థానం

 ప్రత్యేక రోజులు సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోతుంది. ప్రధానంగా ఏకాదశి, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ మరోసారి పెరిగింది. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది  

Queue Complex2/5

క్యూ లైన్

 ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో క్యూ లైన్ లలో నిండిపోయి ఉన్నారు. ఇక కంపార్ట్‌మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.   

Srivari Darshan3/5

శ్రీవారి దర్శనం

 ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి దర్శనానికి 66000 మందికి పైగా రాగా అందులో 27,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం తెలిపింది  

tirumala darshan time today4/5

తిరుమల తిరుపతి దేవస్థానం

 ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా దర్శించుకున్నారు ప్రధానంగా సినీ, రాజకీయ నేతలు కూడా తిరుమల దర్శనాన్ని సందర్శిస్తారు.  ఇక సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా అరంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.  

 tirumala latest news5/5

తిరుమల

 శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రధానంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీటి చర్యలు కూడా తీసుకొని ఉన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగుకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.