Drunk Man bites off cobra snake in Tirupati: నల్లత్రాచును కసితీరా కొరికి రాత్రంతా తన పక్కనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
1/5చాలా మంది పాములు కన్పిస్తే కిలోమీటర్ దూరంలో పారిపోతారు. అంతేకాకుండా పాములు ఉన్నచోట మరల వెళ్లేందుకు అస్సలు సాహాసం చేయరు.ఈ క్రమంలో కోబ్రాలు ఇటీవల అడవులు, చెరువులు ఉన్న చోట నుంచి ఎక్కువగా బైటకు వస్తారు. ఈ క్రమంలో పాములకు చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
2/5ఈ నేపథ్యంలో కొంత మంది పాముల్ని చంపుతూ పైశాచీకంగా కూడా ప్రవర్తిస్తారు. కోబ్రాల్ని చేతిలో పట్టుకుని ఖతర్నాక్ స్టంట్ లకు దిగుతారు. అంతే కాకుండా పాముల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో పాములు వానాకాలంలలో ఎక్కువగా మానవ ఆవాసాల్లోకి వస్తాయి.
3/5అయితే.. తాజాగా.. తిరుపతి జిల్లా తొట్టంబేడుమండలం చియ్యవరంలో ఇటీవల దారుణం చోటు చేసుకుంది. వెంకటేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో రాత్రి పూట ఇంటికి వస్తున్నాడు. ఇంతలో అతడ్ని నల్లత్రాచు కాటు వేసింది. దీంతో కోపంలో ఊగిపోయిన అతగాడు నల్లత్రాచుపై కసితీరా దాడి చేశారు.
4/5అంతే కాకుండా దాని తలను కొరికి అత్యంత వైలెంట్ గా ప్రవర్తించాడు. రాత్రిపూట నల్లత్రాచును తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. బెడ్ మీద పెట్టుకుని పడుకున్నాడు. తెల్లవారు జామున అతగాడు అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
5/5హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉండటంతో మరల అతడ్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రుయాలో అతనికి వైద్యం అందిస్తున్నారు. మరికొన్ని గంటల వరకు ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.