Tirumala: టీటీడీపై 17 ఏళ్ల పోరాటం.. స్వామి వారి ఆశీస్సులతో విజయం సాధించిన భక్తులు.. స్టోరీ ఏంటంటే..?

Ttd darshan news: మహబూబ్ నగర్ కు చెందిన భక్తులు టీటీడీపై వినియోగ దారుల ఫోరంలో కేసు వేసి విజయం సాధించాడు. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో ఆ భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు.

1 /6

తిరుమల శ్రీవారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా కొలుచుకుంటారు.ఈ క్రమంలో చాలా మంది తిరుమలకు వెళ్లి గంటల తరబడి కూడా క్యూలైన్ లలో వేచి ఉండి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. కొంత మంది తలనీలాలు ఇచ్చి మొక్కలు తీర్చుకుంటే, మరికొందరు నిలువెత్తు బంగారం, తమకు తోచిన మొక్కుల్ని స్వామి వారికి చెప్పుకొని అవి నెరవేరగానే వచ్చి తీర్చుకుంటారు. అయితే.. తిరుమలలో ఇటీవల  ఏపీ తెలంగాణ నేతలకు చెందిన సిఫారసుల్ని టీటీడీ అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

2 /6

అయితే.. టీటీడీపై మహబూబ్ నగర్ కు చెందిన కొంత మంది భక్తులు వినియోగ దారుల ఫోరంలో పిటిషన్ వేసి విజయం సాధించారు.   దీనికోసం ఆ భక్తులు 17 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. మహబూబ్ నగర్ కు చెందిన వ్యాపారి శెట్టి చంద్రశేఖర్ దంపతులు..  2008 నవంబరు 26న రూ. 21,250  ల డీడీలను తిరుమల పేష్కార్, తిరుప్పావడ సేవల కోసం తీశారు.   

3 /6

ఆ తర్వాత ఈ డీడీ లేఖల్ని.. తిరుమల పేష్కార్ కు పంపారు.  2021 లో సెప్టెంబర్ 10న సేవల్లో పాల్గొనేందుకు డీడీ తీశారు. కానీ అప్పట్లో కరోనా మహమ్మారి వెలుగు చూడటంతో భక్తులకు ఈ సేవల్ని రద్దు చేశారు.   

4 /6

దీనిపై ఆ జంట పలు మార్లు టీటీకి తమ బాధను చెప్పుకున్నారు. లేఖల్ని రాశారు.ఈ క్రమంలో టీటీడీ ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పింది.  ఆ తర్వాత.. టీటీడీ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆ జంట వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వినియోగ దారుల ఫోరం.. ఆ భక్తులకు టీటీడీ శ్రీవారి సేవల్లో పైన పేర్కొన్న సేవల్లో అవకాశం కల్పించాలని లేకపోతే.. ఆ జంటలకు.. రూ. 10  లక్షల చొప్పున చెల్లించాలని 2024  మే8న వినియోగదారుల ఫోరం  తీర్పునిచ్చింది.  

5 /6

టీటీడీ రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. అక్కడే తెల్చుకొవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇటీవల దీనిపై మరల వాదనలు జరిగి.. ఈ క్రమంలో వినియోగ దారుల ఫోరం జడ్జీ.. దీనిపై చెప్పిన విధంగా.. రూ. 50 గతంలో చెప్పిన విధంగా  యాభైశాతం డిపాజిట్ చెల్లిస్తారా..లేకుంటే.. జైలుకు వెళ్తారా..అని టీటీడీపై కోర్టు సీరియస్ అయ్యింది.  

6 /6

దీనిపై టీటీడీ దొగొచ్చి సదరు భక్తులకు.. ఆగస్టు 14, 15 తేదీల్లో రెండు కుటుంబాలకు దర్శన భాగ్యం అయ్యేలా చూస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సదరు భక్తులు 17 ఏళ్ల పోరాటానికి శ్రీవారి ఆశీస్సులతో విజయం సాధించినట్లైంది. వినియోగ దారుల ఫోరం తీర్పుతో భక్తులు భావోద్వేగానికి గురయ్యారు.