Tirumala News: తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?

Ttd latest news: టీటీడీ తిరుమలకు వచ్చే భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 25, 30 వ తేదీల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
 

1 /5

తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా నమ్ముతారు. పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా మనదేశం నుంచి మాత్రమేకాకుండా.. ఇతర దేశాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తిరుమలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.  

2 /5

ఇప్పటికే తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు రాజకీయ నాయకులు ఇచ్చే సిఫారసుల లెటర్లను ఆమోదించాలని ఏపీ సర్కారు టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు టీటీడీ నిన్న మార్చి 24 నుంచి తిరుమల దర్శనాలకు వచ్చే భక్తుల నుంచి సిఫారసులు తీసుకుని ఆయా దర్శనాలు కల్గే విధంగా చూస్తామని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.   

3 /5

ఈ క్రమంలో టీటీడీ తిరుమలకు వచ్చే భక్తులకు మరో కీలక అలర్ట్ ను జారీ చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మార్చి 25, మార్చి 30 రెండు రోజుల్లో కూడా వీఐపీ దర్శనాలు,  అష్టాదళ పాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

4 /5

మార్చి 30 వ తేదీన ఉగాది నేపథ్యంలో..సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అదే విధంగా.. మార్చి 25, 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ అంశాలని భక్తలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు పలు సూచనలు చేసింది.

5 /5

ఒక వైపు పండగలు, మరోవైపు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలొ చాలా మంది తిరుమలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా.. టీటీడీ మాత్రం పకట్బందీ చర్యలు చేపట్టింది. మొత్తంగా టీటీడీ ఇటీవల సామాన్య భక్తుల ప్రయారిటీగా అనేక చర్యలు తీసుకుంది. ఏపీ సర్కారు సైతం. వీఐపీల కల్చర్ ను పక్కన పెట్టి .. సామాన్యలకు శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.