Add Zee Business As A Preferred Source
App

Tirumala: నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు.. అంగరంగ వైభవంగా 5 రోజుల ఉత్సవాలు..

Written ByRenuka Godugu
Published: Mar 09, 2025, 06:48 AM IST|Updated: Mar 09, 2025, 06:48 AM IST

Tirumala Salakatla Teppotsavalu: మార్చి 9 ఆదివారం నుంచి తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశుని శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సాయంత్రం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాల్లో పుష్కరిణిలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
 

Tirumala Tirupati Devasthanam1/5

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీ వేంకటేశుని వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.  

Tirumala Srivaru2/5

తిరుమల శ్రీవారు

తెప్పోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారు పుష్కరిణిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని టిటిడి కూడా ప్రటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.  

Arjitha Brahmotvaam3/5

ఆర్జిత బ్రహ్మోత్సవం

అంతేకాదు ఈనెల 13వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ఈ తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు నిర్వహిస్తారు.  

Tirumala4/5

తిరుమల

ఈ సందర్భంగా స్వామివారి కోసం దేదీప్యమానంగా తెప్పను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పటిష్ట భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో గజఈతగాల్ల ఆద్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.  

Malayappa Swamy5/5

మలయప్ప స్వామి

ఈ తెప్పోత్సవాల్లో శ్రీవారు మొదటి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమివ్వనున్నారు. రెండో రోజు శ్రీకృష్ణ స్వామి రుక్మిణి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణుల్లో తెప్పపై విహరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా తెప్పపై విహరించరున్నారు.