ttd key alerts for Brahmotsavam devotees: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాళ వేళ భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఈ నంబర్ లకు కాల్ చేయాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
1/6కలియుగ దైవం భక్తుల కొంగు బంగారమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీవారిని రోజుకోక వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. గరుడ వాహనం, అశ్వ వాహనం, గజ వాహనం, హనుమంత వాహనం, సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం వంటి వాహనాలపై తిరుమల స్వామివారిని ఊరేగిస్తు భక్తితో పొంగిపోతారు.
2/6ఈ నేపథ్యంలో..ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా అనేక చర్యలు తీసుకుంది. టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.
3/6వాహన సేవలు చూసేందుకు మాడ వీధుల్లో నిల్చునే భక్తులకు ప్రతి 45 నిమిషాలకు 35 వేల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఎల్ ఈడీ లను అమర్చారు. సామాన్య భక్తులే ప్రయారిటీగా దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులు మోసపోయిన, సాయంకావాలన్న ఈ కింది నంబర్ లకు కాల్ చేయాలని టీటీడీ సూచించింది.
4/6భక్తుల కోసం.. తిరుపతిలో 250 హోమ్ స్టేలు, 700 హోటళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. లాడ్జీలు, జీపులు, ట్యాక్సీలు తిరుమలకు పెద్దలకు రూ. 110, పిల్లలకు రూ. 60 చార్జీలు తీసుకొవాలన్నారు. ఎవరైన భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తే డయల్ 112, 80999 99977 నంబర్ కు సమాచారం ఇవ్వాలని అధికారుల్ని సూచించారు.
5/6అదే విధంగా వస్తువులు ఏవైన మిస్ అయితే.. ఎవరైన కన్పించకుండా పోయిన కూడా.. మొబైల్ హంట్ నంబర్.. 94906 17873 లకు కాల్ చేయాలని టీటీడీ కోరింది. ఎమర్జెన్సీ సమయంలో.. కమాండ్ కంట్రోల్ నంబర్.. 80999 99977, 112, కాల్ చేయాలని టీటీడీ కోరింది.
6/6తిరుపతి తూర్పు సీఐ.. 94407 96748, తిరుపతి పడమర సీఐ.. 94407 96750, అలిపిరి పీఎస్ సీఐ..94407 96752, తిరుచానురు సీఐ.. 94407 96755, ఎస్వీయూ సీఐ.. 94910 74525, రైల్వే కమాండ్ కంట్రోల్ .. 94405 74207, రవాణా అధికారి.. 98485 28580 కాల్ చేయాలని టీటీడీ పలు సూచనలు చేసింది.