Add Zee Business As A Preferred Source
App

Tirumala: శ్రీనివాసుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..

Written ByRenuka GoduguUpdated byRenuka Godugu
Published: Sep 19, 2025, 08:01 AM IST|Updated: Sep 19, 2025, 08:01 AM IST

Tirumala Srivari darshan: తిరుమల శ్రీ వెంకటేశ్వర దర్శించుకోవడానికి భక్తులు భారీగా పోటెత్తారు. పెరటి మాసం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని శ్రీనివాసునిగా కొలుస్తారు. ఆయన శ్రీనివాసునిగా అవతరించారని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 
 

Tirumala Tirupati Devasthanam1/5

 తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రేపు, ఎల్లుండి కూడా వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింత కొనసాగే అవకాశం ఉంది.  శ్రీవారి సర్వదర్శనానికి 20 సమయం భక్తులకు పడుతుంది  

Tirumala2/5

 ఇది పెరటసి మాసం కావడంతో అత్యంత విశేషమైంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించారని భక్తులు నమ్ముతారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లలో లైన్‌లలో శ్రీనివాసుని దర్శనానికి భక్తులతో నిండిపోయింది.  

Queue Line3/5

 శ్రీవారి దర్శనానికి క్యూకాంప్లెక్స్ లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఈరోజు స్వామివారి దర్శనానికి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఇక తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి స్వామివారి సాలకట్ల ఉత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు టీటీడీ నిర్వహించనుంది.   

Tokens4/5

 అయితే ప్రతినెలా విడుదల చేసి అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయింపు విధానంలో టిటిడి మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న ఫస్ట్ ఇన్‌ ఫస్ట్ ఔట్ పద్ధతి స్థానంలో లక్కీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే అంగ ప్రదక్షణ టోకెన్లు కూడా లక్కీ డిప్ మాదిరిగానే మూడు నెలల ముందుగా ఆన్‌లైన్లో విడుదలవుతాయి   

Angapradikshana5/5

 ఇటీవల డిసెంబర్ కి సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపింది. టీటీడీ ఈ మార్పును భక్తులు గమనించి టోకెన్లు బుక్ చేసుకోవచ్చు.