Tirumala Devotees Big Alert: తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు విషయంలో భక్తులు ఈ తప్పు చేయొద్దు అని బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. శని, ఆదివారం రోజుల్లో అదను చూసుకున్న ఆలోవాలాలు నయా మోసాలకు పాల్పడుతున్నారు.
తిరుమలకు కొంతమంది ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకొని వస్తారు. మరి కొంతమంది టైం స్లాట్ టికెట్స్ కోసం వస్తారు. ఇది కాకుండా నడకమార్గంలో వెళ్లేవారికి దివ్యదర్శనం టోకెన్లు కూడా లభిస్తాయి. అయితే దీనిని అదనంగా చూసుకొని ఆటోవాలా దందా పెరిగింది.
ఇది కాకుండా అలిపిరి వద్ద పదివేల టైం స్లాట్ టోకెన్లు కూడా జారీ చేస్తున్నారు. ఇలా శనివారం సమయంలో ఆటోవాలాల మోసం పెరిగింది. శ్రీవారి మెట్టు వద్ద కూడా 3000 టైమ్స్ స్లాట్ టికెట్స్ ఇస్తున్నారు.
అయితే ఆటోవాలాలు మాత్రం వారిని మోసగించి అలిపిరి వద్ద టోకెన్లు దొరకమని శ్రీవారి మెట్టు వద్దని టోకెన్లు వస్తాయని ఎక్కించుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారు. అయితే శ్రీవారు మెట్టు దగ్గరికి రాగా అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.
ఎందుకంటే శ్రీవారి మెట్టు వద్ద జారీ చేసేది కేవలం 3000 టికెట్లు మాత్రమే. కాబట్టి వాహనాలు అన్నిటిని ఒకసారి పంపించకుండా విజిలెన్స్ వారు కాసేపు అడ్డగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. తీరా ఆటో వాలలో భక్తులను అక్కడే వదిలేసి తిరిగి వెళ్ళిపోతున్నారు.
ఇక 3 వేల కోటా అయిపోతే దివ్య దర్శనం టోకెన్లు దొరుకుతాయో లేదో అనే భక్తులు తీవ్ర అయోమయంలో పడుతున్నారు. తిరిగి వారు సర్వదర్శనంకు వెళ్లక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలో కొంతమంది ఆటో వాళ్లలో చెప్పే మాటలను నమ్మొద్దని చెప్పింది
దివ్యదర్శనం టోకెన్లు కేవలం మెట్ల వద్దని ఇస్తారని బస్టాండు రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయని చెప్పింది. అంతేకాదు ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి అని సూచించింది.