Tirumala: తెప్పపై శ్రీ మలయప్ప స్వామి అభయం.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..

Tirumala Tirupati Devasthanam Darshanam:  తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతోంది. ఇందులో మొత్తం ఎనిమది కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో సాలకట్ల ఉత్సవాలు కూడా తిరుమలలో నిర్వహిస్తున్నారు.
 

1 /5

తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కూడా భక్తులకు దాదాపు 8 గంటల సమయం పడుతుంది. మొత్తంగా నిన్న ఒక్కరోజు స్వామివారిని 68 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.  

2 /5

8 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు ఎదురు చూస్తున్నారు. నిన్న 23 వేల మందికి పైగా స్వామివారు భక్తులు తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు పైగా వచ్చాయని టీటీడీ సమాచారం.

3 /5

తిరుమల శ్రీవారి సాలకట్ల ఉత్సవాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. బుధవారం స్వామివారు తెప్పపై మలయప్ప స్వామిగా.. శ్రీదేవి,భూదేవి సమేతంగా భక్తులకు అభయం ఇచ్చారు.   

4 /5

మాడ వీధుల గుండా ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ పుష్కరిణిలో విహరించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీవారు పుష్కరిణిలో విహరించారు.  

5 /5

రేపు మార్చి 14వ తేదీ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగిస్తారు.  భక్తులకు స్వామివారి దర్శనం కలుగుతుంది. ఈ వాహనసేవ  ప్రతినెలా పౌర్ణమి రోజు నిర్వహిస్తారు.