Add Zee Business As A Preferred Source
App

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు మరో కీలక అలర్ట్.. ఏకంగా వారం రోజుల పాటు తిరుమలకు చెందిన ఆ టికెట్ల జారీ నిలిపివేత..

Written ByInamdar Paresh
Published: Sep 02, 2025, 07:20 PM IST|Updated: Sep 02, 2025, 07:25 PM IST

Ttd key orders on sri Srinivasa divyanugraha tickets: టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే ఒక వైపుగ్రహణం మరోవైపు కోయల్ ఆల్వారం తిరుమాంజనం నేపథ్యంలో..  సెప్టెంబర్ 7న, 15వ తేదీల్లో  తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి భక్తుల సిఫారసు లెటర్ లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
 

Tirumala:1/6

తిరుపతి ఆలయం:

తిరుమలకు ఇటీవల భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. ఒక వైపు భారీగా కురుస్తున్న వానలు మరోవైపు వినాయక చవితి నేపథ్యంలో  కొండ మీద భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది.ఈ క్రమంలో చాలా మంది ఈ సమయంలో తిరుమలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంచెం వర్షం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుని వెళ్తే ఆ దేవ దేవుడి దర్శనం ఈజీగా అవుతుందని భక్తులు భావిస్తున్నారు.   

Ttd news:2/6

తిరుమలశ్రీవారి దర్శనం:

ఈ క్రమంలో  మరికొన్నిరోజుల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈక్రమంలో తిరుమలలో భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్పటికే స్వామి వారి పుష్కరిణిికి సైతం మరమ్మత్తులు చేశారు. 

tirupati:3/6

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం:

మరోవైపు సెప్టెంబర్ 7న గ్రహణం, 15వ తేదీ కోయల్ ఆళ్వార్ తిరుమాంజనంనేపథ్యంలో స్వామి వారిదర్శనాలకు సంబంధించి వీఐపీ లెటర్ లను తీసుకొనబడవని టీటీడీ ప్రకటించింది. మరోవైపు తిరుమలకు దర్శనాలకు సంబంధించి ఏకంగా వారం పాటు  శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ లను జారీ చేయడం నిలిపి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.  

tirumala darshan:4/6

తిరుమల వీఐపీ దర్శనం:

అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు 07 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రాంతంలో అడ్డుగాఉన్న చెట్లు తొలగింపు, నవనీకరణ తదితరపనులు చేపట్టనున్నట్లు టీటీడీ పేర్కొంది.   

tirumala vip darshan:5/6

టీటీడీ న్యూస్:

ఈ కారణాల నేపథ్యంలో  సెప్టెంబర్ 07వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లను టిటిడి నిలిపివేసింది. సదరు 7 రోజుల్లో దివ్యానుగ్రహ విశేష హోమంను మరోచోట ఏకాంతంగా నిర్వహించనుండడంతో ఆన్ లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు. 

sri srinivasa divyanugraha tickets:6/6

తిరుమల:

సెప్టెంబర్  నెలలో 7 రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్ లైన్ లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయి.  సదరు 7 రోజుల పాటు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ దివ్యానుగ్రహ హోమంలో.. రూ.1600 చెల్లించి ఇద్దరుగృహ‌స్తులు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. హోమంలో పాల్గొనే గృహస్తులకు రూ.300 క్యూలైన్ లో స్వామి వారి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం క‌ల్పిస్తారు.