Add Zee Business As A Preferred Source
App

Tirumala latest News: శ్రీవారి భక్తులు ఎగిరి గంతేసే వార్త.!.. మరో కీలక ప్రకటన చేసిన టీటీడీ.. ఆనందంలో భక్తులు..

Written ByInamdar PareshUpdated byInamdar Paresh
Published: Jun 27, 2025, 11:11 AM IST|Updated: Jun 27, 2025, 11:20 AM IST

Ttd latest update: తిరుమలలతో గత నెల రోజుల నుంచి కొండమీద ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు ఎక్కడికి వెళ్లలేక జామ్ అయిపోయారు. దర్శనం కంపార్ట్ మెంట్లు అన్ని ఫుల్ అయిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉంటున్నారు.
 

Tirumala:1/6

తిరుమల రద్దీ:

కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పొటెత్తారు. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా గోవింద నామస్మరణంతో తిరుమల కొండలు మార్మోగిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి తిరుమలలో రోజుకు కనీసం 70 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.

Tirupati:2/6

తిరుమల టీటీడీ:

కంపార్ట్ మెంట్ లు అన్ని భక్తులతో కిట కిటలాడుతున్నాయి. మరోవైపు స్వామివారి దర్శనానికి కనీసం 20 నుంచి 22 గంటల పడుతుంది. మొత్తంగా టీటీడీ కూడా లైన్ లలో ఉన్న భక్తులకు ఇబ్బందులు కల్గకుండా.. మజ్జీగ, అల్పాహారం వంటి పదార్థాల్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులు భారీ గుడ్ న్యూస్ చెప్పింది.  

ttd news:3/6

తిరుమల వీఐపీ దర్శనం:

తిరుమలలో రెండు రోజుల నుంచి అంటే..  మంగళ, బుధవారం, గురువారం అంటే ఈరోజు కూడా అంతగా రద్దీలేదని టీటీడీ వెల్లడించింది. గత కొన్ని రోజులతో పోలిస్తే అనూహ్యంగా భక్తులు రద్దీ తగ్గింది. ఒక వైపున అమావాస్య, మరోవైపు ఆషాడమాసం కావడంతో చాలా మంది పుణ్యస్థలాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించారు .  

huge rush in tirumala:4/6

తిరుపతి:

దీంతో తిరుమలలో మునుపటిలా రద్దీలేదు.ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఇదే సరైన సమయని టీటీడీ బోర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు..తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ రానుంది. అక్కడ రోడ్లు.. తరచూ వర్షాల కారణంగా రోడ్లు పాడవడంతో టీటీడీ మరమ్మతులకు శ్రీకారం చుట్టింది.

ttd latest news:5/6

టీటీడీ న్యూస్:

 ఘాట్ రోడ్ల పనుల  కోసం రూ.10.55 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. రోడ్డుపనులు నేపథ్యంలో వాహనదారులు అలర్ట్ గా ఉండాలని, ట్రాఫిక్ జాబ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని టీటీడీ పలు సూచనలు చేసింది. 

tirumala news:6/6

తిరుమల:

ఘాట్ రోడ్ పనులు అయితే.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టొవచ్చని టీటీడీభావిస్తుంది.  ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 155257కు ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.