Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త.. ఆ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..!

Tirumala latest news: తిరుమలలో కొన్నిరోజులుగా ముఖ్యంగా మెట్ల మార్గం నుంచి వెళ్లే భక్తులు చిరుతలు, ఎలుగు బంట్లు, పాములతో భయాందోళనలకు గురౌతున్నారు.
 

1 /6

తిరుమల శ్రీవారిని చాలా మంది కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా నమ్ముతుంటారు. తిరుమలకు వెళ్లి స్వామి వారికోసం ఎన్నిగంటలైన క్యూలలో ఉండి, స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తుంటారు.  

2 /6

చాలా మంది మెట్ల మార్గం ద్వారానే తిరుమలకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. తిరుమలలో ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుతలు, ఎలుగు బంట్లు, పాములు కన్పిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.  

3 /6

ఇప్పటికే చాలా మంది భక్తుల్ని చిరుత దాడి చేసిన సంఘటనలు కూడా వార్తలలో నిలిచాయి.ఈ క్రమంలో కూటమి సర్కారు కూడా తిరుమలలో భక్తులకు ఇబ్బంది కల్గకుండా చర్యల్ని తీసుకొవాలని ఆదేశాలు జారీ చేసింది. 

4 /6

అయితే.. తాజాగా.. తిరుమలో మెట్ల మార్గంలో చిరుతల సంచారంతో గత ప్రభుత్వం భక్తులకు చేతిలో కర్రలను ఇచ్చింది. అదే విధంగా గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పింది. ఇప్పటికి కూడా భక్తులు మెట్ల మార్గంలో గుంపులుగానే వెళ్తున్నారు. అయితే.. తాజాగా.. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  

5 /6

శ్రీవారి దర్శనం కోసం నడక మార్గాల్లో వెళ్లే భక్తుల సెఫ్టీ కోసం.. యానిమల్‌ రేడియో కాలర్‌ సిస్టం విధానాన్ని అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు వైల్డ్‌లైఫ్‌ అధికారుల అనుమతి కోరినట్లు సమాచారం. దీనిలో జంతువుల్ని ట్రాక్ చేసేందుకు ఒక విభాగంను ఏర్పాటు చేస్తారు. ఈ రేడియో కాలర్ సిస్టంను ఆయా జంతువులకు అమరుస్తారు.  

6 /6

ఈ జంతువులు కనుక ఒక వేళ భక్తుల మెట్ల మార్గం దగ్గరకు రాగానే.. వీటిని అబ్జర్వ్ చేస్తున్న అధికారులు ఒక సైరన్ లాంటి శబ్దం వచ్చేలా చేస్తారు. దీంతో ఆ జంతువులు భయంతో అడవుల్లోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఈ రేడియో కాలర్ సిస్టమ్ ఐడియాను వైల్డ్ లైఫ్ అధికారుల్ని టీటీడీ ఉంచిందంట. వారి నుంచి అనుమతి వస్తే టీటీడీ ముందుకు వెళ్తుంది. ఇది సక్సెస్ అయితే.. ఇక కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు క్రూర జంతువుల ముప్పు తప్పిందని చెప్పుకొవచ్చు.