Tirumala Summer Darshan: శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఆ సిఫారసులను సమ్మర్‌లో అనుమతించరు..!.. టీటీడీ కీలక నిర్ణయం..

TTd news: టీటీడీ ఎండాకాలం వేళ రికమండేషన్ లెటర్లపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా సాధారణ భక్తులకు దర్శనాలు ఈజీగా అయ్యేలా చర్యలకు ఉపక్రమించింది.
 

1 /5

శ్రీవారిని కలియుగంలో చాలా మంది కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. చాలా మంది వేళ కిలో మీటర్లు తరలి వెళ్లి, గంటల కొద్ది కంపార్ట్ మెంట్ లో వేచి ఉండి మరీ శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతునే ఉంది. ఇటీవల తిరుమలలో సమ్మర్ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యల్ని సైతం తీసుకుంది. 

2 /5

తెలంగాణ రాజకీయ నేతల నుంచి వచ్చే సిఫారసుల్ని సైతం టీటీడీ ఏపీ చంద్రబాబు ఆదేశాల మేరకు స్వీకరిస్తుంది. ఈ క్రమంలో వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ప్రతిరోజు కూడా భక్తులు పొటెత్తుతున్నారు.  ఇప్పటికే ఏపీ చంద్రబాబు సర్కారు.. సామాన్య భక్తులే పరమావాధిగా స్వామి వారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకొవాలని టీటీడీని ఆదేశించింది.   

3 /5

ఈ  క్రమంలో టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించే యోచనలో టీటీడీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

4 /5

ముఖ్యంగా సమ్మర్ సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల సామాన్య భక్తులు క్యూలైన్ లలో గంటల కొద్ది ఉండాల్సి వస్తుంది. ప్రతిరోజూ వీఐపీ బ్రేక్‌ దర్శనాలు నాలుగు వేలు, శ్రీవాణి 1500, దాతలు, వర్చువల్‌ ఎస్‌ఈడీల దర్శనాలు దాదాపు ఐదు వేల వరకు బ్రేక్ దర్శనాల టికెట్లను ఇస్తున్నారు.   

5 /5

అయితే.. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.  స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పించాలని టీటీడీ తెలుస్తోంది. దీనిపై టీటీడీ అధికారికంగా స్పందిస్తేనే ఒక క్లారిటీ రానుంది.