Add Zee Business As A Preferred Source
App

Tirumala Update Today: దీపావళి రోజు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి…సేవలన్నీ రద్దు చేసిన టిటిడి..!

Written ByVishnupriya
Published: Oct 19, 2025, 04:33 PM IST|Updated: Oct 19, 2025, 04:33 PM IST

Tirumala Latest Update : అక్టోబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు దీపావళి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తిరుమలలో కూడా దీపావళి ఉత్సవాలు మొదలైపోయాయి. ఈ క్రమంలో.. పలు సేవలు.. తిరుమలలో దీపావళి రోజు రద్దు చేసింది టీటీడీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

Tirumala Rush On Diwali 20251/6

తిరుమల తాజా అప్‌డేట్

దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో.. అక్టోబర్ 20వ తేదీన దీపావళి ఆస్థానం.. శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ వస్తోంది.

Diwali Sevas in Tirumala2/6

తిరుమల తాజా అప్‌డేట్

దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు.. గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు ఎదురుగా వేంచేపు అవుతారు. అలాగే సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని స్వామివారి ఎడమవైపున మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు.. ప్రసాద నివేదనలు నిర్వహిస్తారు.

Tirumala Sevas Cancelled3/6

తిరుమల తాజా అప్‌డేట్

దీపావళి ఆస్థానం అనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. భక్తులు ఈ సందర్భంలో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందుతారు.

Tirupati Tirumala Sevas 4/6

తిరుమల తాజా అప్‌డేట్

అయితే దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20న కొన్ని సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. క‌ల్యాణోత్స‌వం..ఊంజ‌ల్ సేవ‌..ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌లు ఆ రోజున ఉండవు. తోమాల.. అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం.. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం..కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాల్లో కూడా దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానాలు నిర్వహించనున్నారు.

Tirumala Sevas Today 5/6

తిరుమల తాజా అప్‌డేట్

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి దీపావళి ఆస్థానం జరుపుతారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సహస్ర కలశాభిషేకం సేవ, హనుమంత వాహనసేవను రద్దు చేశారు.

Tirumala Sevas Tomorrow 6/6

తిరుమల తాజా అప్‌డేట్

కార్వేటినగరంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు దీపావళి ఆస్థానం..ఆ తరువాత తిరువీధి ఉత్సవం జరగనుంది.