Today Horoscope April 13 Telugu: శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ఏప్రిల్ 13 ఆదివారం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ప్రధానంగా ఈరోజు ఈ రాశి కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు. మరి కొన్ని రాశులకు ఆదివారం ఏప్రిల్ 13వ తేదీ ఎలా ఉంటుంది తెలుసుకుందాం..
మేష రాశి .. మేష రాశికి ఈ రోజు హాయిగా సాగిపోతుంది. ఈరోజు పనిలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఈ నేపద్యంలో కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుంది. ఆర్థిక లాభాలు గడించే సమయం.
మిథున రాశి.. మిథున రాశి పనుల్లో కాస్త మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో వీరు ఎక్కువగా అలర్ట్ గా ఉండాలి. అంతేకాదు మీరు చేసే పనిలో అడ్డంకులు ఉండవచ్చు. దాని ముందుగానే గ్రహించి ముందుకు సాగాలి. ప్రధానంగా దైవ చింతన ఉండాలి.
కర్కాటక రాశి .. కర్కాటక రాశి వారికి ఏదైనా మనసుపెట్టి పనిచేస్తే సక్సెస్ సాధిస్తారు. ఈ నేపథ్యంలో వీరికి ముందుగా కష్టాలు.. ఆ తర్వాత శుభాలు వెంటనే చూస్తారు. దైవ ఆరాధన ఎంతో ముఖ్యం. ప్రధానంగా సన్నిహితుల కుటుంబ సభ్యుల సలహా మేరకు ముందుకు సాగవచ్చు.
కన్య రాశి .. కన్య రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. వీరికి లాభాలు కూడా గడించే అవకాశం ఉంది. కన్య రాశి వారికి సకాలంలో ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా సాగుతుంది.
వృశ్చిక రాశి .. వృశ్చిక రాశి వారు కూడా కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో కూడా ఒక ముందడుగు కూడా వేస్తారు. అంతేకాదు సకాలంలో పనులు పూర్తిగా జరుగుతాయి. దీంతో వారికి ఉల్లాసంగా గడిచిపోతుంది.
మకర రాశి.. మకర రాశి వారు ప్రధానంగా వీరు కూడా మానసికంగా ఆనందంగా ఉంటారు. గొప్ప లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులకు సఖ్యత కూడా పెరుగుతుంది.
కుంభరాశి.. కుంభరాశి వారు కోపానికి గురి కాకుండా కాస్త కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తే మంచిది. ఆచితూచి అడుగు వేస్తే అన్నిట విజయం సాధిస్తారు. వీళ్ళ మనో ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు వేరే పనికి తగిన ఫలితాలు లభిస్తాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)