Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. కొత్త పనులకు శ్రీకారం చుట్టబోయే రాశి ఇదే..

Written ByRenuka GoduguUpdated byRenuka Godugu
Published: Aug 17, 2025, 06:26 AM IST|Updated: Aug 17, 2025, 06:26 AM IST

Today Horoscope August 17 Telugu: నేటి రాశి ఫలాలు 2025 ఆగస్టు 17వ తేదీ శ్రీ విశ్వ వాస నామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు దక్షిణాయనం సింహ సంక్రాంతి రోజు ఆదివారం రాశుల ఫలాలు ఎలా ఉంటాయి? ఏ రాశిలకు ఇబ్బందులు తప్పవు తెలుసుకుందాం.
 

Aries1/5

మేషరాశి.. మేష రాశి వారికి రుచి పాజిటివ్ గా ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే రోజు. కెరీర్లో పురోగతికి బాటలు వేయండి. తద్వారా ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాస్త బంధుమిత్రులతో జాగ్రత్త వహించండి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

Gemini2/5

 మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. దూర ప్రయాణాలు మానేయడమే మంచిది. ఆరోగ్యం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ సన్నిహితులతో బంధం మరింత బలంగా మారే అవకాశం ఉంది.

Cancer3/5

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారు సున్నితమైన వారు. ఈ నేపథ్యంలో వీళ్లు కొన్ని విషయాల్లో స్ట్రెస్‌ అధికంగా తీసుకుంటారు. అనుభవజ్ఞుల సూచన మేరకు మంచి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా ఇబ్బందులు పడకుండా ఉంటారు. కొత్త ఆలోచనలు అమలుచేసే సమయం ఇది. కెరీర్లో పురోగతికి కూడా సాధిస్తారు. ఆరోగ్యం పై కూడా కాస్త జాగ్రత్త వహించండి.

Aquarius4/5

 కుంభరాశి..  కుంభ రాశి వారు కాస్త కెరీర్ పై దృష్టి పెట్టడం మంచిది. దీని వల్ల అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. బద్ధకం వీరికి ప్రధాన శత్రువుగా మారే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

Pisces5/5

 మీన రాశి..  మీన రాశి వారు కొత్త బిజినెస్ కొత్త ఆలోచనలు చేసేముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఎవరి చేతిలో అయినా మోసపోయా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త లు తప్పనిసరి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)