Today Horoscope December 3 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసనామ సంవత్సరం. 2025 డిసెంబర్ 3 మార్గశిర మాసం, హేమంత రుతువు, దక్షిణాయనం బుధవారం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం. పండితుల ప్రకారం ఏ రాశులు జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త ఆలోచనలు కలిసి వచ్చే రాశి ఏది? తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగిపోతుంది. కోరుకున్న పనులన్నీ జరిగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మేషరాశి వారు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి కూడా ఈరోజు పాజిటివ్‌గా కలిసి వచ్చే రోజు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఆలోచనలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు శుభప్రదమే. పనులన్నీ ఈజీగా సాగిపోయే సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. బంధువులను కలిసే అవకాశం ఉంది.
4/5కుంభరాశి .. కుంభరాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అయినా ఇబ్బందులకు గురవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోండి. బద్ధకం వీడితే మంచిది ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలు సూచన తప్పనిసరి. పని ప్రదేశంలో జాగ్రత్త వహించండి.
5/5మీన రాశి .. మీన రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమం అని చెప్పొచ్చు. పని ప్రదేశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ పెరిగిపోతుంది, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)