Today Horoscope 2025 March 22 Telugu: నేటి రాశి ఫలాలు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం బహుళపక్షం. శిశిర రుతువు ఫాల్గుణమాసంలో 2025 మార్చి 22 శనివారం. ఈరోజు తిథి అష్టమి, తదుపరి పూర్వాషాడ. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:10 గంటలు, సూర్యాస్తమయం సాయంత్రం 6:19 గంటలకు ఉంటుంది.
మేష రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో నిదానంగా సాగుతున్నాయి. అనుకున్న ఫలితాలు లభించవు. మిశ్రమ ఫలితాలు. కష్టపడితే సాధించ లెనిది ఏదీ లేదు. కుటుంబ సభ్యుల ఆలోచనలతో ముందడుగు వేయాలి.
మిథున రాశి వారు చేపట్టిన పని ప్రతి పనిలో ముందుకు సాగుతారు. వీళ్ళు భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి. వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి ఈ రోజు హాయిగా సాగిపోతుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. అంతే కాదు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహా మేరకు ముందుకు వెళ్లాలి. భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.
తుల రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఏ పని చేసిన ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది
ధనస్సు రాశి వారికి కూడా ఈ రోజు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ప్రధానంగా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఏ పని చేసిన విజయం కలిసి వస్తుంది. కుటుంబంలో సఖ్యత పెంచుకోవాల్సిన సమయం.
కుంభరాశి వారికి ఈరోజు సక్సెస్ ఖాయం. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఏ పని చేసిన పెద్దల సూచన మేరకు తీసుకోవడం మంచిది.