Todays March 23 Horoscope Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, బహుళ పక్షం శిశిర ఋతువు 2025 మార్చి 23వ తేదీ ఫాల్గుణ మాసంలో ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది? ఈరోజు ఆదివారం, నవమి తిథి తదుపరి దశమి. ఇక సూర్యోదయం ఉదయం 6:0 9 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6:19 నిమిషాలు.
మేష రాశి.. ఈరోజు మేష రాశి వారు లాభాలను గడిస్తారు. వీరికి రాబడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రత్యేకంగా ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
మిథున రాశి.. మిథున రాశి వారు ఈ రోజు అత్యంత జాగ్రత్త ఉండాల్సిన సమయం. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టాలు తప్పవు. ఆదివారం ప్రతి పనిలో జాగ్రత్త వహించాలి. అచితూచి వ్యవహరించడం మేలు..
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కాస్త పని భారం పెరగొచ్చు. ప్రధానంగా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాదు ఇక కుటుంబానికి అండగా నిలబడతారు. ఆదివారం కర్కాటక రాశి వారికి కాస్త ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించాలి.
సింహరాశి.. ఈ రాశి వారికి కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో వీళ్లకు అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. కుటుంబంలో సభ్యుల సహాయంతో ముందుకు దూసుకెళ్తారు. ప్రతి పనిలో విజయం తప్పక వరిస్తుంది.
తులారాశి వారికి ప్రధానంగా పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. మీరు పెద్దల వల్ల ఆచితూచి నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. పై అధికారుల వల్ల కూడా వీళ్లకు లాభం ఉంటుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ప్రధానంగా ధనస్సు రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు.
మీన రాశి వారు అవసరానికి తెలివితేటలు ఉపయోగించాల్సిన సమయం. అంతేకాదు ఈ రాశి వారు ఆదివారం ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలో విజయం సాధించాలంటే తొందరపాటు పనికిరాదు. పెద్దల నిర్ణయం మేరకు ముందుకు సాగాలి.