Today Horoscope March 30 Telugu: ఈరోజు 2025 మార్చి 30 శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం శుక్లపక్షం, వసంత రుతువు, చైత్రమాసం ఆదివారం. పాడ్యమి తిథి తదుపరి విదియ. సూర్యోదయం 6:04, సాయంత్రం 6:20 గంటలకు ఉంటుంది.
మేషరాశి.. మేష రాశి వారికి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదటి రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాస్త జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగువేయాలి.
వృషభ రాశి.. వృషభ రాశి వారికి పరిస్థితులు ఎలా ఉన్న ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ప్రధానంగా వీరు ఇతరుల అవసరాలకు అండగా నిలుస్తారు. కాస్త కష్టపడే రోజు, పాత స్నేహితులతో మాట కలుపుతారు.
కన్యా రాశి.. కన్యారాశివారికి చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. విజయం వరిస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. భాగస్వామి మద్ధతు కూడా అవసరం.
ధనస్సు రాశి.. ఈ రోజు ఈ రాశివారికి కాస్త పనుల్లో ఆటంకం, చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. త్వరగా కోపం తెచ్చుకోకూడదు.
కుంభ రాశి.. కుంభ రాశివారికి ఈరోజు చాలా ఉల్లాసంగా గడుపుతారు. ఈ రాశివారికి పెద్దల వల్ల లాభం పొందుతారు. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. వారి నుంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు.