Today Horoscope November 14 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసనామ సంవత్సరం 2025 నవంబర్ 14 శుక్రవారం కార్తీక మాసం. శరత్ రుతువు, దక్షిణాయనం పండితుల ప్రకారం ఈ రోజు ఏ రాశులకు అదృష్టం వరిస్తుంది? ఏ రాశులు ఇబ్బందులు ఎదురవుతాయి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
మేషరాశి.. మేష రాశి వారికి ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. అయితే, ఆర్థికంగా పెద్దగా ప్రయోజనాలు ఏమి ఉండకపోవచ్చు. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త వహించండి. పని ప్రదేశంలో జాగ్రత్త ఎందుకంటే ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఈరోజు నయం.
మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ రోజు విజయం వరిస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగిపోతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత తీసుకోండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
సింహరాశి.. సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు కలిసి వస్తాయి. అవి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి ప్రశంసలు పొందే రోజు. పెద్దల నిర్ణయాలతో విజయాలు వరిస్తాయి. బద్దకం వీడితే మరీ మంచిది.
కుంభరాశి.. కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. షాపింగ్ చేస్తారు, మిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే రోజని చెప్పవచ్చు. మొత్తానికి కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా లాభం పడే రోజు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)