Today Horoscope November 15 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 నవంబర్ 15వ తేదీ కార్తీక మాసం శరత్ రుతువు, దక్షిణాయనం శనివారం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి? పండితుల ప్రకారం ఏ రాశులు ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇతరులతో గొడవల పెంచుకోకుండా ఉండండి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సఖ్యత పెంచుకోవాల్సిన సమయం.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాల కలిసి వచ్చే రోజు. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొత్త ప్రాజెక్టులు కూడా చేపడతారు. అది అన్ని విధాల కలిసి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది, కొత్త ప్రయత్నాలు ఏవి చేపట్టిన అవి అనుకూలిస్తాయి.
సింహరాశి.. సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదం. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు కూడా తొలగిపోతాయి. అన్న విధాలుగా కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కొన్ని సమస్యలు మీ నుంచి దూరంగా వెళ్లిపోతాయి.
కుంభరాశి.. కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్దలు సూచన మేరకు నడుచుకుంటే మంచిది. లేకపోతే ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.
మీనరాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు అన్ని విధాలా తెలిసి వచ్చే రోజు. బిజినెస్ అనుకూలిస్తుంది, విందు వినోదాలకు వెళ్లే సమయం. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)