Today Horoscope October 28 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం, కార్తీకమాసం 2025 అక్టోబర్ 28 మంగళవారం. శరత్ రుతువు. దక్షిణాయనం ద్వాదశ రాశుల్లో ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు కాస్త స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. పని ప్రదేశంలో కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.
2/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త పనులు ప్రారంభించే వారికి బాగుంటుంది. కర్కాటక రాశి వారు స్ట్రెస్ తగ్గించుకొని ముందుకు వెళ్ళండి.
3/5సింహరాశి.. సింహ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి కోపం త్వరగా రానివ్వకండి.
4/5కుంభరాశి.. కుంభరాశి వారికి ఈరోజు పాజిటివ్‌గా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది.
5/5మీన రాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు హాయిగా సాగిపోయే రోజు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)