Today Horoscope October 29 Telugu: నేటి రాశి ఫలాలు ఈ రోజు శ్రీ విశ్వ వాసునామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ రుతువు, దక్షిణాయనం 2025 అక్టోబర్ 29 బుధవారం రోజు రాశి ఫలాలు ఉండనున్నాయి? జ్యోతిష్యులు చెబుతున్న సూచనలు ఏంటి తెలుసుకుందాం.
1/5మేషరాశి.. మేషరాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. కోరుకున్న పనులు ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి అవకాశాలు పొందే ఛాన్స్ ఉంది. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. తద్వారా మానసికంగా కూడా ఉత్సాహాన్ని పెంచుతుంది.
2/5మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యం పై శ్రద్ధ పెంచండి. మీపై నెగెటివిటీ పెంచే వాళ్ల నుంచి దూరంగా ఉండండి.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడ ఈరోజ పూర్తవుతాయి. అంతేకాదు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
4/5సింహరాశి.. సింహ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అవి అన్ని విధాలా కలిసి వస్తాయి. అయితే ఏ విషయంలోనూ బాధపడకుండా కోపం తగ్గించుకొని ఆలోచించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
5/5కుంభ రాశి.. కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్త వహించాల్సిన రోజు. ఇతరులతో గొడవలకు దిగకూడదు. మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త. దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)