Today Horoscope September 10 Telugu: నేటి రాశి ఫలాలు ఈ రోజు శ్రీ విశ్వ వాసన సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. దక్షిణాయనం బుధవారం 2025 సెప్టెంబర్ 10వ తేదీ రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం..
1/5మేషరాశి.. మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. దూరప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోండి. మీ అలసత్వంతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగిపోతుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక లాభాలు గడిస్తారు. అంతే కాదు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనే రోజు.
3/5కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. తద్వారా విజయం వరిస్తుంది. ఇతరులతో వాగ్వాదాలు దిగకండి తీసుకువస్తుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ పనిపై మీరు దృష్టి సారించండి. మంచి ఫలితాలు పొందుతారు.
4/5కుంభరాశి.. కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. పనిలో కీలకంగా వ్యవహరించాలి. ఆరోగ్యం పై జాగ్రత్తగా తీసుకోండి. అనారోగ్యకరమైన ఆహారాల జోలికి వెళ్ళకండి. అంతే కాదు ఈరోజు కాస్త ఇబ్బంది పెట్టే రోజు. మీ పని మీరు చూసుకుంటే మంచి పనులు ఫలితాలు పొందుతారు.
5/5మీన రాశి.. మీన రాశి వారికి రోజు పాజిటివ్ గా ఉంటుంది. ఎంతో హాయిగా సాగిపోయే రోజు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)