Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశికి ఉల్లాసంగా సాగిపోతుంది, పాజిటీవ్‌‌ వాతావరణం..

Written ByRenuka GoduguUpdated byRenuka Godugu
Published: Sep 11, 2025, 06:50 AM IST|Updated: Sep 11, 2025, 06:52 AM IST

Today Horoscope September 11 Telugu: నేడు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, భాద్రపద మాసం వర్షఋతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 11 గురువారం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి? ఏ రాశులు జాగ్రత్త పడాలి తెలుసుకుందాం.
 

Aries1/5

 మేషరాశి..  మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ఎంతో ఎంజాయ్ చేసే రోజు. అయితే ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Taurus2/5

 వృషభ రాశి  వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు త్వరగా తీసుకోలేకపోతున్నారు. తద్వారా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. గొడవలకు దిగకుండా ఉండండి. ఒత్తిడి తీసుకోకండి.

Cancer3/5

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి శుభ కాలం నడుస్తుందని చెప్పొచ్చు. కీలక విషయాల్లో ముందడుగు పడుతుంది. అన్ని శుభవార్తలే వింటారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. అంతేకాదు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

Aquarius4/5

 కుంభరాశి..  కుంభరాశి వారికి ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మంచి విజయాలు పొందుతారు. అలసత్వం పనికిరాదు. కాలక్షేపం చేయకూడదు. తద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కుంభరాశి వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన రోజు. 

Pisces5/5

 మీన రాశి..  మీన రాశి వారు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)