Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు కొత్త వ్యాపారాలు కలిసి వచ్చే రాశి, ఆ విషయంలో జాగ్రత్త..

Written ByRenuka Godugu
Published: Sep 13, 2025, 07:12 AM IST|Updated: Sep 13, 2025, 07:12 AM IST

Today Horoscope September 13 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 13 శనివారం ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
 

Aries1/5

 మేష రాశి..

 మేష రాశి..  మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోండి. అయితే స్ట్రెస్ పెంచుకోకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు గొడవలకు దిగకండి. విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

Gemini2/5

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త కాస్త ఇబ్బందికరంగా ఉండే రోజు. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. ఈరోజు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మిథున రాశి వారు తగాదాలకు దూరంగా ఉండాలి..

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమైన రోజు అని చెప్పొచ్చు. అన్ని పనులు పూర్తవుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం పై కూడా జాగ్రత్త తీసుకుంటారు. కొత్త నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. 

Leo4/5

 సింహరాశి..

 సింహరాశి..  సింహరాశి వారికి కూడా ఈరోజు బాగా కలిసి వచ్చే రోజు అను చెప్పొచ్చు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్రెండ్స్ తో విహార యాత్రకు వెళ్తారు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. బాగా కలిసి వచ్చే రోజు.

Aquarius5/5

కుంభరాశి..

 కుంభరాశి..  కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. అయితే పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే రోజు. కాస్త వ్యాపారాల పై దృష్టి పెట్టండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)