Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు కొత్త పనులు చేపట్టకండి, ఒత్తిడికి గురయ్యే అవకాశం..

Written ByRenuka Godugu
Published: Sep 19, 2025, 07:08 AM IST|Updated: Sep 19, 2025, 07:08 AM IST

Today Horoscope September 19 Telugu: నేటి రాశి ఫలాలు 2025 సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం. భాద్రపదం మాసం, వర్ష ఋతువు, దక్షిణాయం ఏ రాశులకు ఆర్థిక కష్టాలు తప్పవు.. ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 
 

Aries1/5

మేష రాశి ..

మేష రాశి .. మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఎవరితోనూ అనవసరంగా వాగ్వాదాలకు దిగకండి. ఈరోజు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా దూర ప్రయాణాలు వెళ్లాల్సి వస్తే వాయిదా వేసుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పనులు పూర్తి చేసుకోండి. 

Gemini2/5

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. మీ పనులపై మీరు దృష్టి పెట్టండి. పాజిటివ్ ఆలోచనలు చేయండి. 

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారు కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది. మంచి రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. దూరప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. అయితే కాస్త కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఎమోషనల్ కి గురిచేస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి .

Leo4/5

సింహరాశి..

సింహరాశి..  సింహ రాశి వారు కూడా ఈరోజు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. ఖర్చులు నియంత్రించుకోండి. విషయం మీ పరిస్థితులు అదుపులో ఉంటాయి.  మీరు సానుకూలంగా మంచి ప్రయోజనాలు కూడా వస్తాయి.

Aquarius5/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారి వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగా కలిసి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు కూడా వెళ్తారు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మొత్తం పాజిటివ్‌గా ఉంటుంది. కోరుకున్న పనులు లభిస్తాయి. ఆరోగ్యం కూడా కలసి వస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)