Today Horoscope September 21 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, వర్ష రుతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 21 ఆదివారం మహాలయ అమావాస్య రోజు ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులకు కష్టాలు తప్పవు తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేషరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. అంతే కాదు కొత్త వారితో పరిచయాలు ఈరోజు కుదరవు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందాలంటే కాస్త స్ట్రెస్ తీసుకోవాల్సిందే. ఇతరులతో గొడవలు దిగకుండా ఉండండి. మాట అదుపులో పెట్టుకోండి.
2/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారు కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఏది ఏం జరిగినా స్ట్రెస్ తీసుకోకుండా ధైర్యం గా పోరాడండి. తద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశివారు తీసుకోకపోవడమే మంచిది.
3/5సింహరాశి.. సింహ రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా కూడా సింహ రాశివారికి కలిసి వస్తుంది
4/5తులారాశి.. తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. వాదనలకు దిగకుండా ఉండండి. పని ప్రదేశంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే అవకాశాలు చేజారే అవకాశం ఉంది.
5/5కుంభరాశి.. కుంభ రాశి వారికి అమావాస్య మిశ్రమంగానే ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి ఏ నిర్ణయాలు తీసుకున్న జాగ్రత్త. లేకపోతే అది విషమించే అవకాశం కూడా ఉంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)