Today Horoscope September 22 Telugu: నేడు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం ఆశ్వీయుజ మాసం శరదృతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 22 సోమవారం శరన్నవరాత్రులు ప్రారంభం.. ఈరోజు రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం..
1/5
మేష రాశి..
మేష రాశి..
మేష రాశి వారికి ఈ రోజు ఎంతో శుభకరంగా ఉంటుంది. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీతో కలగలుపుని ఉంటుంది. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశం. కొత్త పనులు కూడా ప్రారంభించవచ్చు.
2/5
మిథున రాశి
మిథున రాశి
మిథున రాశి వారికి కాస్త మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.పెద్దవారు నిర్ణయం మేరకు నడుచుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అతిగా స్ట్రెస్ తీసుకోకండి.
3/5
కర్కాటక రాశి..
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు శుభకరంగా ఉంటుంది. అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది.
4/5
సింహరాశి..
సింహరాశి..
సింహ రాశి వారికి కాస్త మిశ్రమంగానే ఉంటుంది. కాస్త స్ట్రెస్ తో కూడుకొని ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోలేరు. ఆర్థికంగా కలిసి రాకపోవచ్చు. అయితే సింహరాశి వారికి కాస్త కోపం తగ్గించుకుంటే ఏదో ఒక మార్గం లభిస్తుంది. తద్వారా విజయాలు వరిస్తాయి.
5/5
కుంభరాశి..
కుంభరాశి..
కుంభ రాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అనవసరమైన గొడవల్లో తలదూర్చకుండా ఉండాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)