Today Horoscope September 4 Telugu: నేటి రాశి ఫలాలు ఈ రోజు శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్షఋతువు దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 4 గురువారం ఏ రాశులకు కష్టాలు తప్పవు? ఏ రాశులకు అదృష్టం కలసి వస్తుంది తెలుసుకుందాం..
1/5మేషరాశి.. మేష రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగుతుంది. కోరుకున్న ప్రతిదీ దక్కుతుంది. అంతే కాదు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలోకి వెళ్తాయి. ఈరోజు మేష రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు జాగ్రత్త వహించండి ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త ఆరోగ్యం పై కూడా శ్రద్ధ తీసుకోండి.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే రోజు అని చెప్పాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పార్టీలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
4/5సింహరాశి.. సింహ రాశి వారికి రోజు ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి. స్ట్రెస్ తీసుకోకుండా పనులు ముగించండి. తద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే రోజు అది కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు.
5/5కుంభరాశి.. కుంభ రాశి వారు విజయాన్ని సాధించాలంటే బద్దకాన్ని పక్కన పెట్టండి. లేకపోతే అద్భుతాలు చూడలేరు. కుంభ రాశి వారు ఏ నిర్ణయాలు తీసుకున్న పెద్దవాళ్ల సూచన మేరకు మంచి ప్రయోజనాలు పొందుతారు. ధైర్యంగా కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయండి తద్వారా విజయం వరిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)