Today Horoscope September 5 Telugu: నేటి రాశి ఫలాలు 2025 సెప్టెంబర్ 5 శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం. భాద్రపద మాసం, వర్ష ఋతువు దక్షిణాయనం శుక్రవారం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.. ఏ రాశులకు శుభయోగం? ఏ రాశులకు కష్టకాలం ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు పాజిటివ్ గానే ఉంటుంది. కానీ కీలక నిర్ణయాలు కోపంతో తీసుకోకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు దానికి కాస్త కష్టం చేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే రోజు.
2/5వృషభ రాశి.. వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థిక లాభాలు గడిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే రోజు. వృషభ రాశి వారు ఈ రోజు కొత్త పనులు ప్రారంభించవచ్చు. అవి ఆర్థికంగా కలిసి వస్తాయి.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాలు కలిసి వచ్చే రోజు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. హాయిగా ఎంజాయ్ చేసే రోజు. పార్టీలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశివారు ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే రోజు.
4/5కుంభరాశి.. కుంభ రాశి వారు ఈ రోజు బద్దకంగా ఉంటారు. అది కాస్త పక్కకు పెడితే పనులు పూర్తవుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా విజయం వరిస్తుంది. అనవసరంగా గొడవలకు దిగకుండా మీ పనులు పూర్తి చేసుకోండి. తద్వారా అనుకున్నది సాధించవచ్చు.
5/5మీన రాశి.. మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అయితే కాస్త ఉపశమనం అందించే రోజు స్ట్రెస్ తగ్గుతుంది. కీలక నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవచ్చు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)