Today Horoscope September 8 Telugu:నేటి రాశి ఫలాలు ఈరోజు 2025 సెప్టెంబర్ 8 సోమవారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం, భాద్రపద మాసం వర్ష రుతువు, దక్షిణాయనం. ఇబ్బందులు పడే రాశులు ఏవి? ఈరోజు ఏ రాశికి కలిసి వస్తుంది తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి రోజు పాజిటివ్ గా సాగుతుంది. అన్ని శుభకరమైన పనులు పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందే రోజు. తద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి ఈ రోజు అంత శుభప్రదంగా ఉండకపోవచ్చు. వ్యక్తిగతంగా పనిపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందులు పెట్టే రోజు. స్ట్రెస్ తీసుకోకుండా పనులు పూర్తి చేసుకోండి. ఆరోగ్యం పై జాగ్రత్త వహించండి.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ తోటి వారి సహాయంతో ముందుకు సాగుతారు. అంతేకాదు ప్రదేశంలో కూడా మంచి ఫలితాలు పొందే రోజు. ఆనందంగా సాగిపోయే రోజు అవుతుంది.
4/5సింహరాశి.. సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సోమవారం కలిసి వచ్చే రోజు. ఇబ్బందులు తొలగుతాయి. అనుకున్న పనులు సమయానికి జరిగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
5/5కుంభరాశి.. కుంభరాశి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పెద్దల సూచన మేరకు వ్యవహరించండి. తద్వారా మంచి లాభాలు పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)