Today Horoscope September 9 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్షఋతువు దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 9 మంగళవారం. ఏ రాశులకు కష్టాలు తప్పవు? ఏ రాశులకు కలిసి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాస్త ఆరోగ్యం ఇబ్బందులు తప్పవు. పనులు సమయానికి పూర్తిగా కాకుండా ఉంటాయి. కాస్త స్ట్రెస్‌కు గురి చేసే అవకాశం ఉంది. కెరీర్లో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారంలో కూడా కాస్త జాగ్రత్తలు వహించండి.
మిథున రాశి.. మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగుతాయి. అంతేకాదు వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి. మిథున రాశి వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక గుడ్ న్యూస్ కూడా వింటారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే రోజు.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెంచుకుంటారు. అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటే కూడా అది మీకు ఎంతో మంచిది. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎంతో కీలకమైన రోజు కూడా.
కుంభరాశి.. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. ఏ నిర్ణయాలు తీసుకున్న జాగ్రత్త.. అనవసరంగా నోరు పారేసుకోకండి. కుటుంబంలో గొడవలకు దిగకండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టండి. తద్వారా మంచి విజయాలు పొందుతారు సమయం వృథా చేయకుండా ముందుకు సాగండి.
మీన రాశి.. మీనరాశి వారికి కూడా ఈరోజు ఎంతో కలిసి వచ్చే రోజు. కొత్త శుభవార్తలు కూడా వినే రోజు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకునే రోజు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)