Today Horoscope September 28 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం శరదృతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 28 ఆదివారం ఏ రాశిలకు ఇబ్బందులు తప్పవు ? ఏ రాశిలకు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆర్థికంగా కలిసి వచ్చే రాశుల జాబితా ఏంటో తెలుసుకుందాం..
1/5మేషరాశి.. మేష రాశి వారికి కోపం తగదు. శత్రువుల పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది
2/5వృషభ రాశి.. వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఈ రోజు స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అంతేకాదు పార్టీలకు వెళ్లే అవకాశం కూడా ఉంది అయితే ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి..
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకోకుపోవడమే మంచిది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారులు జాగ్రత్త ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
4/5సింహరాశి.. సింహరాశి వారికి ఈరోజు మానసికంగా .. ఆర్థికంగా కలిసివచ్చే రోజు. శుభ కరమైన రోజు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక శుభవార్త వింటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం పై మాత్రం జాగ్రత్త తీసుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.
5/5మీన రాశి.. మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది, కాస్త జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త తీసుకోండి .(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)