Horoscope: నేటి రాశిఫలాలు.. వీళ్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది..

Today April 24 Horoscope Telugu: 2025 ఏప్రిల్ 24వ తేదీ 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? అదృష్టం కలిసి వస్తుందా ?ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకుందాం.. ఈరోజు శ్రీవిశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గురువారం. 
 

1 /6

 మేష రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది. కార్య సిద్ధి కూడా కలిసి వస్తుంది. ప్రధానంగా వీళ్లు శుభవార్తలు కూడా వింటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గురువారం మేషరాశి వారికి లాభదాయకంగానే ఉంటుందని చెప్పొచ్చు.   

2 /6

 కర్కాటక రాశి వారు సున్నితమైన మనసు కలవారు. ఈరోజు వీళ్లకు చాలా బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. ఆరోగ్యం పై కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆందోళన తగ్గించుకోవడం కూడా మంచిది. ప్రతి పనిలో అయితే విజయం మీవైపే ఉంటుంది. ఇక పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు.  

3 /6

 సింహరాశి వారు కూడా ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. తీసుకునే నిర్ణయంలో ఆచితూచి అడుగు వేయాలి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. అంతేకాదు చేపట్టిన పనుల్లో అనుకూలంగా ఉంటుంది.   

4 /6

 తులారాశి వారికి కూడా ఈరోజు కొన్ని మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఎక్కువ శాతం దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. అయితే కుటుంబంలో పెద్దవారి సూచనల మేరకు నడుచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్న కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.   

5 /6

 ధనస్సు రాశి వారికి ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాస్త ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. మీలో కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. అది మీకు పాజిటివిటీని పెంచుతుంది .  

6 /6

 కుంభరాశి వారికి ఈరోజు శుభం ప్రాముఖ్యంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. అందులో ఫలితాలు పొందుతారు. అయితే ప్రధానంగా దూర ప్రాంతాలకు వాయిదా వేసుకోవడమే మంచిది. పెద్దవాళ్ల నిర్ణయాలు కచ్చితంగా తీసుకోవాలి. ప్రతి విషయాన్ని ఆలోచించి తీసుకోవాలి. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవడం కూడా మంచిది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)