Today Horoscope October 4 Telugu: నేటి రాశి ఫలాలు 2025 అక్టోబర్ 4వ తేదీ ఈ రోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం. శనివారం ప్రదోష వ్రతం. ఏ రాశిలకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాపారాలు కలిసి వచ్చే రాశులు ఏవి తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగిపోతుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదే మీలో పాజిటివిటీని పెంచుతుంది.
2/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్ట్రెస్ తీసుకోకండి. ఇతరులతో వాగ్వాదానికి దిగకుండా జాగ్రత్త తీసుకోండి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త. కొత్త నిర్ణయాలు, పనులు ప్రారంభించకుండా ఉండండి.
3/5సింహరాశి.. సింహ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. గొడవలకు దిగకుండా ఉండండి. తద్వారా మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. పని ప్రదేశంలో కూడా జాగ్రత్త. వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఇబ్బందికరంగానే ఉండవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి.
4/5ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆ పాజిటివ్‌గా సాగిపోతుంది. కుటుంబంలో కలిసి ఎంజాయ్ చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అది మీకు మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
5/5కుంభరాశి.. కుంభరాశి వారు ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. ఈరోజు వీరికి ఆనందంగా సాగిపోతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)